ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకుందాం. 

Written by telangana jyothi

Published on:

ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకుందాం. 

– యాదవ సంఘం వనభోజనాల సమావేశం

 – పాలెం ప్రాజెక్టు వద్ద యాదవుల వనభోజనాల సందడి. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడెం గ్రామానికి చెందిన యాదవులు ఆధ్వర్యంలో, మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాదవులంతా గురువారం కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మండలంలోని, పాలెం ప్రాజెక్టు వద్ద వనభోజనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకున్నారు. దూర ప్రాంతానికి వచ్చిన యాదవ కుటుంబాలు బంధువులను క్షేమాల సమాచారాలతో, ఒకరికొకరు పలకరించుకొని, ఎంతో కాలం తర్వాత వనభోజనాల దగ్గర కలుసుకున్నామని పరస్పరం సంతోషంతో, కుశల ప్రశ్నలతో, క్షేమాలతో పలకరించుకున్నారు. కార్తీకమాసంలో బంధుమిత్రులు, కుల పెద్దలు కుటుంబాలతో వనభోజనాలు కార్యక్రమాన్ని యాదవుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని యాదవులు అంతా వనభోజనాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కొడారి శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సమావేశంలో ప్రసంగించారు. యాదవు లంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని, ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల విషయంలో అన్ని రంగాల్లో యాదవులకు అన్యాయం జరుగుతుందని, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి నెలకొంద న్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ కులవృత్తులతో ప్రతినిత్యం కష్టార్జితులుగా జీవన పోరాటం సాగిస్తున్న యాదవులు అన్ని రంగాల్లో ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు విషయంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. అర్హులైన పేద యాదవులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, అలాగే యాదవులకు సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, ఈ సందర్భంగా సమావేశంలో తీర్మానించి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంఘం తరఫున యాదవ సంఘం పెద్దలకు, పట్టు శాలువాలతో సన్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొడారి శ్రీనివాస్ యాదవ్ ను మండల యాదవ సంఘం, యువత, పెద్దలు శాలువాలతో సన్మానించి సభాముఖంగా గౌరవ మర్యాదలతో యాదవుల హర్షద్వారాల మధ్య సన్మానించారు. అనంతరం యాదవలంతా వనభోజనాల కార్యక్రమం లో పాల్గొని, కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా భోజనాల కార్యక్రమం ముగించుకొని, పాపమ్మ మేడల దేవతకు పూజలు నిర్వహించి వచ్చే ఏడాది కూడా వనభోజనాల కార్యక్రమాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకునే విధంగా సకలజనులు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని, ఈ సందర్భంగా కార్తీక మాసం ఏకాదశి మంచి రోజున యాదవులు వారి ఇష్టదేవాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవులతో పాటు మహిళా సోదరీమణులు పిల్లాపాపలు తో పెద్ద సంఖ్యలో పాల్గొని యాదవుల వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని వారి వారి గ్రామాలకు క్షేమంగా చేరారు. ఇష్టదైవాలకు నమస్కారాలు చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now