ఎన్నికలవేళ మావోయిస్టుల కరపత్రాల కలకలం.
– గ్రామాల్లోకి ఎన్నికల ప్రచారం కు వెళ్లేందుకు పార్టీల నేతల ఆందోళన.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మావోయిస్టులు లేఖలు విడుదల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుం డగా గురువారం సాయంత్రం పొద్దుబోయే సమయంలో జె యం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ, వెంకటాపురం, వాజేడు మండలాల మావోయిస్టు ఏరియా కమిటీల పేర్లతో వెంకటాపురం చర్ల ప్రధాన రహదారిపై మండల పరిది లోని పాత్రా పురం గ్రామం వద్ద మావోయిస్టుల కరపత్రాలు లేఖలు దర్శనమిచ్చాయి. ఎన్నికలు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారంతో గ్రామాలులో సైతం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఒకపక్క పోలీసులు అడవులలో జల్లడ పడుతుండగా మరోపక్క మావోయిస్టులు కరపత్రాలు ప్రధాన రహదారిపై వెదజల్లటం తో రాజకీయ పార్టీలు ప్రచారాలకు గ్రామాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీ గ్రామాలలో ప్రత్యేక పోలీసు బలగాలతో జెల్లడపడుతుండగా గురువారం పొద్దుపోయిన తర్వాత వెంకటాపురం మండల పరిధిలోని పాత్ర పురం గ్రామం ప్రధాన రహదారిపై మావోయిస్టులు లేఖలు కరపత్రా లు వెదజల్లటంతో రాజకీయ పార్టీలు అంధోళన వ్యక్తం చేస్తున్నా యి. డిసెంబర్ 2వ తేది నుండి 8వ తేదీ వరకు పి ఎల్ జి ఏ వారోత్సవాలు గ్రామ గ్రామాన జరుపుకోవాలని ,గ్రామాల్లో ఇన్ఫార్మర్ వ్యవస్థను ధ్వంసం చేయాలని ఇంకా అనేక అంశాలపై లేఖలో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బూటకపు ఎదురు కాల్పుల ను ఖండించాలని, గ్రామాల్లో గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని ఇంకా అనేక అంశాలతో కరపత్రాలలో పేర్కొన్నట్లు సమాచారం.