ఇంటింటా దీపావళి కాంతులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : దీపావళి పండగ పర్వదినం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో ఆనందోత్సవాల మధ్య దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో పండుగ సందర్భంగా భక్తులు వేకువజామున నుండే పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పండగ పర్వదిన సందర్భంగా ఒకరోజు ముందుగానే ఇల్లు వాకిళ్లు అందంగా అలంకరించుకొని, ముత్యాల ముగ్గులు రంగ వల్లులతో హ్యాపీ దీపావళి అంటూ స్వాగతం తో రంగవల్లులు, ముత్యాలముగ్గులతో వాకిళ్లను మహిళా సోదరీమణులు, గృహిణులు అలంకరించారు. ఆదివారం సాయంత్రం పొద్దుపోయే సమయానికి ప్రతి ఇంట్లో నూనె ప్రమిదలలో దీపాలు వెలిగించి, పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దీపావళి మందు గుండు సామాగ్రిని ఆయా కుటుంబ సభ్యులు కాల్చుకునే కాకర్స్ , పెద్దలు వెలిగించే, శబ్దాలు కలిగించే మందు గుండు సామాగ్రి గ్రామాల్లో వెలిగింపులతో సంతోషాలతో పండుగ జరుపుకున్నారు. అనేక గ్రామాల్లో వెదజల్లే చిచ్చుబుడ్లు కాంతులతో దీపావళి పండుగ ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. మందు గుండు సామాగ్రి , ముత్యాలముగ్గులు, రంగవల్లులు, ప్రమిదల దీపాలతో పండుగ వాతావరణంతో గ్రామాల్లో నూతన శోభన ను సంతరించుకున్నది. అనేకమంది పేరంటాళ్ళు ,కుటుంబాలు పుణ్యస్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో ఆదివారం అయినా శాఖాహార పిండి వంటల గుమగుమలతో, పులిహార ,క్షీరాన్నలతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. పలువురికి పంపిణీ చేశారు. ఆనంద ఉత్సవాల మధ్య జరిగిన దీపావళి పండుగ సందర్భంగా వెంకటాపురం, వాజేడు మండలంలో మందగుండు సామాగ్రి , చిచ్చుబుడ్లు, తారాజువ్వలు పెద్దల,పిల్లల చిరునవ్వులు, పిల్లలకేరింతలతో, ఆనందోత్సవాల మధ్య దీపావళి పండుగ అంగరంగ వైభవంగా, కన్నుల పండుగా జరిగింది.