ఇంటర్మీడియట్ విద్యార్థులకు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, జూలై 1 ,తెలంగాణ జ్యోతి :  జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో గల ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఇంటర్మీడి యట్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలు కల్పనపై విద్యా, టిజిడబ్ల్యూఐడిసి ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనకు జిల్లాలోని 5 జూనియర్ కళాశాలలకు రూ 41.07 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి నిధులతో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. ఈ నిధులతో సివిల్ మరమ్మతులు, ఎలక్ట్రికల్, మంచినీరు, పారి శుధ్య కార్యక్రమాలు వంటి సదుపాయాలపై ఫోకస్ చేయాలని, ఇట్టి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, డీఈఓ రాజేందర్, టీజడబ్ల్యూఐడిసి డిఈ రామకృష్ణ, ఏఈ మహేందర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సంక్షేమ పథకాల అమలుపై ప్రచారం

– లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి

జూలై 1వ తేది నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు జరుగనున్న జనసురక్షా ప్రచార కార్యక్రమం భారత ప్రభుత్వం ఆదేశాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో ఆర్థిక సంక్షేమ పథకాలపై సమగ్ర శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎల్డిఎం తిరుపతి తెలిపారు. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాటారం శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఎల్డిఎం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన తిరుపతి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, కే వై సి పునరిద్దరణ నూతన నమోదులు, పునర్నవీకరణలను చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఈ ప్రధాన ఆర్థిక సామాజిక భద్రతా పథకాల పరిధిని 100% పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటారం ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్,అంకుషాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment