ఆరు గ్యారంటీలతో.. అధికారంలోకి వస్తున్నాం…
- కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం షురూ
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల తో అధికారంలోకి వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం షురూ చేశారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలోని హనుమాన్ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల కార్డుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సబ్ స్టేషన్ పల్లి పుట్టమల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఆదరణతో ప్రజలు రానున్న కాలంలో సుభిక్షంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి. ప్రభాకర్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య అన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాల కార్డును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి. ప్రభాకర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి , ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, పిసిసి మహిళా కార్యదర్శి అంగోతు సుగుణ, డిసిసి మహిళా కార్యదర్శి డాక్టర్ ఏలుబాక సుజాత, డిసిసి ఉపాధ్యక్షులు కుంభం స్వప్న, గద్దె సమ్మిరెడ్డి, చీమల వెంకటస్వామి సర్పంచులు మాజీ ఎంపీటీసీలు చీర్ల తిరుపతిరెడ్డి, అజ్మీరా రఘురాం, ఓం సింగ్, కొట్టే శ్రీశైలం, కొట్టే శ్రీహరి, గంగి రెడ్డి లచ్చిరెడ్డి, మద్ది నవీన్, చీమల రాజు, చీమల సత్యం, మాచర్ల రాజేందర్, గోనే శ్రీనివాస్, మంత్రి నరేష్, జాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.