ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ 12 వ ఆవిర్భావదినోత్సవం.
వెంకటాపురం నూగూరు తెలంగాణాజ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని కోమరంభీం విగ్రహం వద్ద గురువారం ఎటిఎ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎటిఎ వాజేడు మండల అధ్యక్షుడు ఇర్ప.బాలాజీ మాట్లాడుతూ !టీచర్స్ సమస్యల పై ప్రభుత్వాలు స్పందించటం లేదన్నారు. ఇప్పటికీ 3 డిఎ లు పెండీంగులో ఉన్నాయని, తెలిపారు. స్థానికత ప్రాబ్లమ్స్ తో సతమత మౌతున్నరని అన్నారు. అలాగే. ఏజెన్సీ ప్లేన్ ఏరియా వ్యశ్యాసం ఉండాలని ,!ఏజెన్సీ ప్రాంత లో జి ఒ లు అమలు చేయట్లేదని అన్నారు. ఈ సమావేశంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్ఎం సిద్ధ బోయిన జోగయ్య, మరియు ములుగు జిల్లా ఎ.టిఎ నాయకులు మరియు వాజేడు మండలంలోని నాయకులు పెండ కట్ల.బుచ్చిబాబు (పి.డి) మడివి. నాగేందర్, రావు ,ఇర్ప.వెంకన్న, సిద్ధ బోయిన.భద్రాచలం, కుంజా.సతీష్, చే లె. నాగేంద్ర ప్రసాద్. ,నాలి.వెంకటేశ్వర్లు. గొడ్డే.అనిల్,.రాజ్యలక్ష్మి(పి. ఇ.టి),కుంజ. తిరుపతి , .అనీల్ , బోదే బోయిన.శ్రీనివాసు , మడే.జనార్ధన్ , లక్ష్మణ్ తదితరులు ఉపాధ్యాయులుఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.