అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ములుగు జిల్లా

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ములుగు జిల్లా

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ములుగు జిల్లా

– 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క

ములుగు ప్రతినిధి, ఆగస్టు 15, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహనీయులు గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్, సర్దార్ పటేల్, నేతాజీ త్యాగాలను స్మరిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు.  అభివృద్ధి పథంలో ములుగు జిల్లా ముందుకు కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు కట్టుబడి ఉందని, బీసీలకు 42% రిజర్వేషన్లు, 60,000 ఉద్యోగాల భర్తీ, యువత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ములుగు జిల్లా అభివృద్ధి: ఆయిల్ పామ్ పరిశ్రమ, మోడల్ బస్టాండ్ (₹4.80 కోట్లు), ఏటూరునాగారం బస్ డిపో (₹6.28 కోట్లు), కలెక్టరేట్ భవనం, ట్రైబల్ యూనివర్సిటీ, టాస్క్ సెంటర్, మున్సిపాలిటీ ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు; 2026 మేడారం జాతర ఏర్పాట్లు వేగంగా. మహాలక్ష్మి పథకం: 1.35 కోటి ఉచిత ప్రయాణాలు, ₹81.23 కోట్లు వ్యయం. ఆరోగ్య శాఖ: ఆరోగ్యశ్రీ పరిమితి ₹10 లక్షలకు పెంపు, 2,800 మందికి ₹10.99 కోట్లు లబ్ధి, 71% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 24,038 మందికి వైద్య శిబిరాలు, క్యాన్సర్ సర్జరీలు విజయవంతం, 50 ఎంబీబీఎస్ సీట్లు ప్రారంభం. వ్యవసాయం: రైతు భరోసా ₹99.10 కోట్లు, రైతు బీమా ₹10.90 కోట్లు, యాంత్రీకరణ పరికరాలు ₹79.60 లక్షలు, మొక్కజొన్న నష్టపరిహారం ₹3.81 కోట్లు. విద్యుత్: 39,079 మందికి ₹39.44 కోట్లు సబ్సిడీ, కొత్త ఉపకేంద్రాలు. పౌర సరఫరాలు: సన్న బియ్యం పంపిణీ, ₹52.70 కోట్లు బోనస్, 78,701 టన్నుల ధాన్యం కొనుగోలు, గ్యాస్ సబ్సిడీ ₹4.39 కోట్లు. గ్రామీణాభివృద్ధి: మహిళా సంఘాలకు ₹80.54 కోట్లు రుణాలు, చేయూత పెన్షన్లు 38,060 మందికి, 7.57 లక్షల పనిదినాలు. నీటిపారుదల: యాసంగి 53,278 ఎకరాలు, వానాకాలం 88,018 ఎకరాలకు సాగునీరు, 88,030 గృహాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు. ఇళ్లు & సామాజిక పథకాలు: 4,601 ఇళ్లు మంజూరు, 3,678 పూర్తి, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ₹2.71 కోట్లు. అటవీ & పరిశ్రమలు: 14.26 లక్షల మొక్కల నాటకం, తూనికాకు ₹341.86 లక్షలు, 24 పరిశ్రమలు, ₹38.20 కోట్లు పెట్టుబడులు, 221 మందికి ఉపాధి. పర్యాటకం: రామప్ప ఐలాండ్ అభివృద్ధి ₹74 కోట్లు. విద్య: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో 81.12%తో ప్రథమ స్థానం. ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు ఎస్పి సదానందం, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఎస్ ఎస్ టి యు వైస్ చాన్సలర్, గ్రంథాల సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేశ్,  అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, జిల్లా లోని అన్ని కార్యాలయల సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ములుగు జిల్లా

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment