అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు

Written by telangana jyothi

Published on:

అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు

– బీజెపీ అభ్యర్థి ఛంద్రుపట్ల సునీల్ రెడ్డి

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన కూడా నా మీద నమ్మకం తో నాకు ఓటు వేసిన ప్రతి ఒకరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంథని బీజెపీ అభ్యర్థి చంద్రుపట్లా సునీల్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణ లో మరింత శక్తి వంతమైన పార్టీ గా అవతరిస్తుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటె స్ట్ ఎమ్మెల్యే చంద్రుపట్ల సునీల్ మాట్లాడారు.మంథని పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రు పట్ల రాం రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ఓటమి తో మరింత బలంగా అవుతాం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నెరవేర్చలేని పక్షం లో ప్రజల తరుపున పోరాడుతామని అన్నారు. మంథని లో చిల్లర రాజకీయలకు కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నాయకులు తెరలేపారు. నేను శ్రీధర్ బాబు కి అమ్ముడు పోయానని బి ఆర్ ఎస్ నాయకులు, పుట్ట మధుకు అమ్ముడు పోయానని కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, కాని నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు, ఒక నీతి నిజాయతి గల పార్టీ బీజేపీ, నమ్మిన సిదాంతం కొరకు పని చేస్తాం ఒక్క రూపాయి కూడ పంచలేదన్నారు మంథని లో మార్పు కొరకు పరితపిస్తున్న, మంథని లో కాలేజీ లు, ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండాపాక సత్యప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లు పూసల రాజేంద్ర ప్రసాద్, బొల్లం కిషన్, మేడిపల్లి పూర్ణ చందర్, మండల ఉప అధ్యక్షులు రేపాక శంకర్, సీనియర్ నాయకులు కొట్టె సాంబయ్య, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now