అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
- మహాదేవపూర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
తెలంగాణ జ్యోతి, మహాదేవపూర్: మహాదేవపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, ఎంపీపీ రాణి బాయి రామారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మైనార్టీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అశ్రార్ ఖురేషి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం అశోక్, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవిచందర్, నాగరాజు, సంతు, నెన్నల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు