అంజన్న స్వాముల భక్తుల భజనతో హోరెత్తిన అయ్యవారిపేట.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామంలో శ్రీ అభయాంజ నేయ స్వామి వారి ఆలయం వద్ద అంజన్న స్వాముల భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ అంజన్న స్వాములు భజన కార్యక్రమా లతో స్వామి కీర్తనలతో,స్వామి నామ ధ్యేయం తో నిర్వహించిన భజన కార్యక్రమం హోరెత్తించారు. అంజన్న స్వాములు మాల ధారణ భక్తులు ప్రతిరోజు స్వామి ఆల యంలో, భజనా కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీక్షాఫలము లతో అత్యంత నిష్టతో,శ్రీ అంజన్న స్వాములు స్వామి భక్తి కృపకు పాత్రులు అవుతున్నారు. ఈ సందర్భంగా రాత్రి పొద్దుపోయిన తర్వాత స్వామి ఆలయంలో లౌడ్ స్పీకర్ ద్వారా అంజన్న మాల థారణ స్వాములు భజన కార్యక్రమం భక్తులను, జై శ్రీ ఆంజనేయ జై జై శ్రీ ఆంజనేయ అనే నామధేయం తో హోరేత్తించారు. వ్యవ సాయ రైతాంగ, పాడిపంటల గ్రామమైన అయ్యవారిపేట చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అంజన్న స్వామి వారి మాలధారణ భక్తులు స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను పునీతులను చేసింది. ఈ సందర్భంగా స్వామివారికి ఇష్టపూర్వకమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిం చి,అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. సకలజనులు సుఖశాంతు లతో ఉండాలని,పాడిపంటలు సక్రమంగా పండాలని అష్ట ఐశ్వర్యా లు, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఈ సందర్భంగా అంజన్న దీక్షాపరులు, భక్తులు స్వామిని పూజా కార్యక్రమాలతో ప్రతినిత్యం వేడుకుంటున్నారు.