సీతక్కకి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
మంగపేట, డిసెంబర్ 7, తెలంగాణ జ్యోతి : హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క నూతన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే క్వార్డర్స్ వద్ద మంగపేట మాజీ జెడ్పిటిసి ఆకా రాధాకృష్ణ, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎండి ఇస్సార్ ఖాన్ సీతక్కని కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.