రూ.5 వేల తో దీపోత్సవానికి నూనె వితరణ
గణపురం, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి రూ 5 వేల తో గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు పావన రాజ్యలక్ష్మి దంపతులు నూనె క్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి నూ యినెను అందించిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.