ములుగులో బడా కాంట్రాక్టర్ కు, స్వంత ఇల్లు లేని బడే నాగజ్యోతికీ పోటీ

ములుగులో బడా కాంట్రాక్టర్ కు, స్వంత ఇల్లు లేని బడే నాగజ్యోతికీ పోటీ

తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, మంగపేట : మండలంలోని మల్లూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా రోడ్డు భవనాల కార్పొరేషన్ చైర్మన్,నాలుగు మండలాల ఇంచార్జ్ మెట్టు శ్రీనువాస్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రానున్న ములుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోరుగు రాష్ట్రాoలో బడా కాంట్రాక్టులు ఉన్న సీతక్కకు స్వంత ఇల్లు కూడా లేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మధ్య పోటీ అనే అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కొద్ది రోజుల నుంచి ఓటమి భయంతోనే అసలు నవ్వడమే మానేసి మతిభ్రమించి అదేపనిగా బీఆర్ఎస్ పై దుష్ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపించారు. నామీద పగబట్టి కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్లు డబ్బు సంచులతో వస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కుట్రలు చేసే వ్యక్తి కాదని ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే వ్యక్తి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రచారంలో దూసుకు పోతుండ టం, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ చిల్లర మాటలు మాట్లాడుతూ బురద చల్లుతున్నారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాలే గెలిపిస్తాయన్నారు. ములుగు నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కకు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రహ్లాద్ కు ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తున్నారు. ములుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ములుగు జిల్లా ఇచ్చారు. కుసుమ జగదీష్ స్మారకార్థం మల్లంపల్లి మండలా న్ని ప్రకటించారు. అలాగే ఏటూరు నాగారానికి రెవెన్యూ డివిజన్ ను ప్రకటించారు. ములుగు లో ఒక్కప్పుడు సూది మందుకు, మందు గొలిలకు ఏడ్చిన పరిస్థితి అలాగే వైద్యం సకాలంలో అందక మరణించిన మరణాలను ఎన్నో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అలాంటి పరిస్థితులకు తావు లేకుండా 65 కోట్లు పెట్టీ మూడు వందల పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేశారన్నారు. అలాగే ములుగు కేంద్రంలో రూ.184 కోట్లు పెట్టీ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే హెల్త్ ప్రొఫైల్ 1 లక్ష 30 వేల మందితో సమాచారం తీసుకుని వారి ఆరోగ్య సమాచారం సేకరిస్తున్నట్లు, రాష్ట్రంలో సుమారుగా 3600 పైచిలుకుగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. ములుగు జిల్లాలో 56 గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కెసిఆర్ దే అన్నారు. ఎన్నో గ్రామాలకు, గూడల్లో త్రాగునీటి సమస్యతో అల్లాడిపోయే వారు అలాంటి ప్రాంతాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య లేకుండా ములుగు జిల్లాలో సుమారుగా 505 గూడలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారన్నారు. ములుగు జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకునే 17 వేల కుటుంబాలకు పోడు పట్టాలు ఇచ్చారు. ములుగు జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడడం హేమమైన చర్య అన్నారు. మంగపేట మండలంలో ఎన్నో సంవత్సరాలుగా మూతబడిన బిల్ట్ కార్మాగారం త్వరలో పునః ప్రారంభ మయ్యేలా చేస్తామన్నారు. నాగజ్యోతి ప్రాణ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు అడవి సంపద,పేద ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బడే ప్రభాకర్ అన్న నిర్మలక్క బిడ్డ కాబట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నాగజ్యోతి భారీ మెజార్టీతో గెలవడం, కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ , గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్, మల్లూరు దేవస్థానం చైర్మన్ నూతిలకంటి ముకుందం, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కూర్బన్ అలీ, రైతుబంధు జిల్లా సభ్యులు పచ్చి శేషగిరిరావు, లలితమ్మ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం , యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బడిశా నాగారమేష్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, తోలెం నర్సిహారావు, కేక్కం జగదీష్, మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం ఈశ్వర్,మండల మహిళా అధ్యక్షురాలు, గోస్కుల లక్ష్మి, మహిళ నాయకురాలు, కొరమం ధనలక్ష్మి, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్ ,పార్టీ నాయకులు, చిట్టీమల్ల సమ్మయ్య, చిలకమర్రి రాజేందర్ , కొమరం రాంమ్మూర్తి, తాటి కృష్ణ, కర్రీ శ్యాంబాబు, పొదేం కృష్ణ, జబ్బ సమ్మయ్య, యర్రంగాని మోహన్ రావు, యాలవర్తి శ్రీనివాస్, కర్రీ రవీందర్ , పూజారి శ్రీను, గుమ్మల వీరాస్వామి ,సుకుమార్ యూనిస్, సందీప్, గుడివాడ శ్రీహరి , తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ములుగులో బడా కాంట్రాక్టర్ కు, స్వంత ఇల్లు లేని బడే నాగజ్యోతికీ పోటీ”

Leave a comment