బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు

ములుగు ప్రతినిధి : బీజేపీ పార్టీ ములుగు మండల మాజీ అధ్యక్షుడు, ఎంబీసీ కులాల అధ్యక్షులు బాణాల రాజ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం లో చేస్తున్నటువంటి అభివృద్ధి లో భాగస్వామ్యం కావడానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్సీ రాజ్ కుమార్ కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుదీర్, మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ , ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు విజయరాం నాయక్, బైకాని సాగర్ , ఎంపిటిసి ముడుతనపల్లి మోహన్, దొడ్డెపల్లి రఘురాం , గంటల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment