బాలసాని బాటలొనే నేత బలరాం కాంగ్రెస్ బాట.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన రైతు సీనియర్ మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి డి.బలరాం మాజీ ఎంఎల్సీ కాంగ్రేస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ అనుసరుడు గా మండల స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించే విధంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా వీరభద్రవరం పరిసర గ్రామాల్లో గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో తమ రాజకీయ గురువు, ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్సీ బాలసా ని లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ ప్రియతమ నేత శిష్య బృందంలో ఉన్న తాను కూడా తమ నేత బాటలోనే కాంగ్రెస్ పార్టీలో బాలసాని సమక్షంలో చేరినట్లు డి.బలరాం ప్రకటించారు. మంచి నాయకుడిగా పేరొందిన వీరభద్రారం చెందిన నాయకుడు డి. బలరాం మంగళవారం ఎన్నికల పర్యటన కోసం భథ్రాచలం ఎంఎల్ఎ పీ.వీరయ్య తో ఎన్నికల పర్యటనలో బాలసాని సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బి. లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వీరయ్యలు పార్టీలోకి స్వాగతించి పార్టీ కండువా తో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లో ఉంటూ, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ మండల నాయకుల సహకారం తో అధికార దృష్టికి తీసుకువెళ్లి పేద ప్రజలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. తన మిత్ర బృందం తో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికి, అనుకోకుండా తన రాజకీయ గురువు బాలసాని గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందని నేత బలరాం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఘన విజయం సాధించేందుకు, పార్టీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో నాయకులతో, తన శిష్య బృందంతో, అనుచరులతో ఎన్నికల ప్రచారం ను మండలం లో పాల్గొని, హస్తం గుర్తుకే మన ఓటు వేసి మన ప్రియతమ నేత ఎమ్మెల్యే వీరయ్యను గెలిపించుకుంటామని ,ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా మనీ ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు డి. బలరాం ప్రకటించారు. తమ రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ ఆదేశంపై ,భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య గెలుపు కోసం ఎన్నికల ప్రచార కథన రంగంలో తన అనుచరులు, శిష్య బృందంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తామని, సీనియర్ నేత బలరాం పార్టీ నేతల ముందు ప్రకటించి, జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నేతల ముందు కార్యకర్తలను ఉత్తేజపరిచారు.