ప్రచారంలో దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబం

ప్రచారంలో దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబం

  • టీఎస్ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి మల్లంపల్లిలో ఇంటింటి ప్రచారం

తెలంగాణ జ్యోతి,  నవంబర్ 16, ములుగు ప్రతినిధి : దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబం ఎన్నికల ప్రచారం నిర్వహించింది. గురువారం టి ఎస్ రెడ్డి చైర్మన్ వై సతీష్ రెడ్డితో కలిసి కుసుమ జగదీష్ కుమారుడు సత్య, జగదీష్ భార్య రమ్య లు మల్లంపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత కొన్ని నెలల క్రితం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ములుగు ఎన్నికల ఇంచార్జి సతీష్ రెడ్డి మల్లం పల్లి లో ప్రచారం ప్రారంభించగానే దివంగత కుసుమ జగదీష్ సతీమణి భావొద్వేగానికి లోనవగా ఆమెను కుటుంబ సభ్యులను సతీష్ రెడ్డి ఓదార్చారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ మల్లం పల్లి అంటే జగదీష్ కు ఎంతో ప్రాణం అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆశీర్వదించి పంపిన ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. తన భర్త జగదీష్ కోరిక మేరకు మల్లంపల్లిని మండలంగా కేసీఆర్ ప్రకటించారని, నాగజ్యోతి ని గెలిపించి ముఖ్యమంత్రి కి కానుకగా ఇస్తామని అన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment