పిఆర్టియు ములుగు జిల్లా అధ్యక్షులుగా వాంకుడోతు జ్యోతి
తెలంగాణ జ్యోతి, నవంబర్ 22, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా పిఆర్టియు సర్వసభ్య సమావేశం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది.ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పిఆర్టియు ములుగు జిల్లా అధ్యక్షులుగా వాంకుడోతు జ్యోతి ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శి గా కొయ్యడ సురేందర్,గౌరవ అధ్యక్షులుగా తాడిచేర్ల రవి,వర్కింగ్ ప్రెసిడంట్ గా రౌతు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ముడురేశి చెన్నయ్య , ప్రధానకార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షం గౌడ్ ,పార్వతి సత్తయ్య , ఎన్నికల అధికారిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా , నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ములుగు జిల్లా పిఆర్టియు తెలంగాణ సంఘం ఉపాధ్యాయిని ఉపాద్యాయులు పాల్గొన్నారు.