పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: పారా లీగల్ వాలంటీర్లకు రెండవరోజు శిక్షణ కొనసాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని మండలాలల్లో కొత్తగా నియామకమైన పారా లీగల్ వాలంటీర్లకు రెండవరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీ ఎల్ ఎస్ ఏ హాలులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కే. సురేష్ కుమార్ ప్రసంగించారు. మోటారు వెహికల్ చట్టం గురించి, రోడ్ భద్రత, ఆక్సిడెంట్లు, ఇన్సూరెన్స్ కి సంబంధించి విషయాల గురించి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, వివిధ మండలాల నుండి వచ్చిన పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.