పటిష్ట ప్రణాళికతో సజావుగా ఎన్నికలు : ఎస్పీ కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి , భూపాలపల్లి ప్రతినిధి: పటిష్ట ప్రణాళికతో సజావుగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేత్కర్ స్టేడియంలో పోలిసు బలగాల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వద్ద ఎస్పి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వ హించడానికి జిల్లాలో సుమారు 2000 మంది, ఛత్తీస్ ఘడ్ హోoగార్డులు, సీ ఆర్ పీ ఎఫ్ జిల్లా పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా పరిధిలో భూపాలపల్లి , మంథని నియోజక వర్గాలు ఉన్నాయని అన్నారు. బందోబస్త్ లో భాగంగా ప్రత్యేక పెట్రోలింగ్, పార్టీలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (క్యూ ఆర్ టీ)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ ,10 సీ ఆర్ పీ ఎఫ్కంపెనీల కేంద్ర బలగాలును, జిల్లా పోలీసుల సేవలను వినియోగిస్తున్నామని, ఎలాంటి ఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతoగా ఎన్నికలు ముగిసేగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 405 పోలింగ్ స్టేషనులు ఉన్నాయని, ఇందులో మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లు 76, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 102 ఉన్నాయన్నారు. మావోయిస్ట్, సమస్యా త్మక పోలింగ్ కేంద్రాల ప్రశాంత పోలింగ్ నిర్వహణ కోసం అదనపు పోలిసు బలగాలను మోహరించామని ఎస్పి పేర్కొన్నారు. పటిష్ట భద్రత మధ్య ఈ వీ ఏం లను పోలింగ్ కేంద్రాలలకు తరలిస్తున్నా మని అన్నారు. ఎన్నికల సందర్భంగా అoతర్ రాష్ట్ర, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరoతర తనిఖీలు చేపడుతున్నా మని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తూ,ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు .ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 18 నమోదు కావడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజలు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల ను పండగగా జరపుకోవాలని, ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికల నియ మావళి పాటిస్తూ, స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు పంచరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి కిరణ్ ఖరే వెల్లడించారు.