ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఒకరు మృతి.
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని పెట్రోల్ పంపు ముందు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలలోకెళ్తే…ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని పెట్రోల్ పంపు ముందు ఉన్న యూటర్న్ వద్ద ద్విచక్ర వాహనం యూటర్న్ అవుతుండగా హనుమకొండ నుండి ములుగు వైపు వస్తున్న కంటైనర్ ( లారీ ) ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో కృష్ణ కాలనీకి చెందిన పోరిక విశ్వేశ్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. చిదురాల మనోజ్, కొలిపాక వినయ్ లకు తీవ్ర గాయాలు అవడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజిఎంకు తరలించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలతో పలువురిని కలిచి వేస్తున్నాయి.