జర్నలిస్టులకు అన్నదానం చేసిన నల్లగుంట సర్పంచ్  

జర్నలిస్టులకు అన్నదానం చేసిన నల్లగుంట సర్పంచ్  

వెంకటాపూర్, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని జర్నలిస్టులకు నల్లగుంట సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి ఆదివారం అన్నదానం ఏర్పాటు చేశారు. పాలంపేట గ్రామంలో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారికి మద్దతు ప్రకటించి మందల సుచరిత శ్రీధర్ రెడ్డి అన్నదానం చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టుల సేవలను గుర్తించి ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం తమ వంతు సహకారం అందించాలన్నారు.బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఇండ్ల స్థలాలు ఇప్పించ డంతో పాటు ఇండ్లునిర్మించి ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బేతి సతీష్,ఒద్దుల మురళి, రంగిశెట్టి రాజేందర్,దండెపల్లి సారంగం,బానోత్ యోగి, ఎనగందుల శంకర్,పిల్లల మర్రి శివరాం,కేతిరి బిక్షపతి, విక్రమ్,ఆలుగొండ రమేష్, మామిడిశెట్టి ధర్మతేజ, మామిండ్ల సంపత్, ఎనబోతుల కృష్ణ, గుని గంటి హరీష్,ఎండి రఫీ,ఆకులరామకృష్ణ,దేశిని వినీల్,గట్టు ప్రశాంత్, పోశాల చంద్రమౌళి, మునిగాల రాజు,బీరెల్లి రమేష్,అశోక్ తదితరు లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment