చిన్నగంగారం వద్ద పాలెం ప్రాజెక్టు పంట కాలువకు బుంగ.
– ఆయకట్టు రైతాంగం ఆందోళన.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ముటీలుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు మండల పరిధిలోని చిన్న గంగారం గ్రామ వద్ద అక్విటెక్టి కు భుంగపడింది. రెండు రోజుల క్రితం నుండి నీటి లీకేజీ తో ప్రారంభమై, క్రమక్రమంగా పెద్ద బుంగగా మారింది. సిమెం ట్ కాలువకు బుంగ ఏర్పడి సగం నీరుకు పైగా వృధాగా వాగులో కలుస్తున్నది. దీంతో భర్లగూడెం , చిరుత పళ్లి, రామవరం, పర్శిక గూడెం ఇతర గ్రామాల వందల ఎకరాల ఆయకట్టుకు దీంతో సాగునీరు అందటం లేదు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర పంటలు వేసిన ఆదివాసి రైతాంగం చిన్న గంగారం వద్ద పంట కాలువ వంతె న కాలువకు బుంగపడటంతో, సాగు నీరందక రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులకు తెలియపరచిన పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమక్రమంగా బుంగ పెరిగి కూలిపోయే ప్రమాదం ఉందని, దీంతో వందలాది ఎకరాల గిరిజనుల భూము లు, పంట పొలాలు మిర్చి, మొక్కజొన్న ఇతర పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయకట్టు ఆదివాసి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వెంకటాపురం మండలం బర్లగూడ పంచాయతీ చిన్న గంగారం గ్రామం వద్ద పంట కాలువ అక్విడెక్టు కు పడిన గండి రోజురోజుకు పెరిగి పెద్దదవుతుంది. ములుగు జిల్లా కలెక్టర్, పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని,మరమ్మతులు చేయాలని ఆయకట్టు రైతాంగం పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
1 thought on “చిన్నగంగారం వద్ద పాలెం ప్రాజెక్టు పంట కాలువకు బుంగ.”