కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కో కన్వీనర్ గా నాయిని శ్రీనివాస్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి:అసెంబ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మంథని శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ గా, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాసు ను నియమించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.తన నియామకానికి సహకరించిన ఎంపీపీ సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, ప్రచార కమిటీ కన్వీనర్ కుంభం రమేష్ రెడ్డిలకు నాయిని శ్రీనివాస్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజకవర్గం లో శ్రీధర్ బాబు గెలుపునకు కృషి చేయనున్నట్లు నాయిని శ్రీనివాస్ వెల్లడించారు.