ఆలుబాక, సురవీడు పంచాయతీల మీడియా సంఘం ఎన్నిక.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాకలో గురువారం , ఆలుబాక&సూరవీడు పంచాయతీ గ్రామాల్లో విధులు నిర్వహిస్తు న్న ప్రింట్ మరియు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా పాత్రికేయులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు మీడియా సోదరు లు సేకరించి తాము పనిచేస్తున్న సంస్థలకు తాజా సమాచారం పంపించి,ప్రచురితం ధ్వార సమస్యల పరిష్కారం కోసం, తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న పాత్రికేయ సోదరులు సేవలు ను అబినందించుకొన్నారు. తమకంటూ ఒక సంఘంగా ఉండి, పెద్దల సహకారంతో విధులు నిర్వహించేందుకు, సమిష్టిగా, ఐక్యంగా వుండీ ప్రభుత్వపరంగా హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకోవాలని, సోదర భావంతో కలిసిమెలిసి పని చేసుకోవాల ని తీర్మానించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను ఎప్పటి కప్పుడు తమ సంస్థల ద్వారా బయట ప్రపంచానికి తెలియపరచి, సంబంధి త శాఖ అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీడియా సోదరులను పరస్పరం అభినందించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఈ కమిటీ లలో గౌరవ సలహాదారులుగా బంధం సాంబశివరావు, అధ్యక్షుడిగా ఎస్.కె.ముస్తఫా, ఉపాధ్యక్షుడిగా బానారి సురేష్ కుమార్ , కార్యద ర్శిగా తెల్లం ఆనంద్ కుమార్, కోశాధికారిగా ఇరుప మురళి, ప్రచార కార్యదర్శిగా కంతి ప్రశాంత్ తదితరుల హర్షద్వానాల మధ్య ఏక వాక్య తీర్మానంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన కమిటీ తెలిపింది. మనమంతా ఐక్యంగా ఉండి, వృత్తి ధర్మాన్ని నెరవేర్చు కుంటూ, పరస్పరం సహకారంతో, ప్రభుత్వపరంగా హక్కులు తో పాటు, సంక్షేమ పథకాలు మంజూరు అయ్యేవిధంగా ప్రజాప్రతి నిధులు, సమాజ సేవకులు, పెద్దలు ,మరియు వివిద శాఖల అదికారుల సహకారంతో ముందుకు సాగాలని, ఈ సందర్భంగా తీర్మానించారు. వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది . ఈ కార్యక్రమంలో సంఘం మద్దతు దారులు సబ్కాసాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.