అబ్బాయిగూడెంలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం అబ్బాయి గూడెం గ్రామంలో ఆదివారం క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు,గ్రామ యువత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ, క్రికెట్ యువత హర్షద్వానాల మధ్య కేక్ కట్ చేశారు. క్రికెట్ క్రీడాకారులు, యువత పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి జేజేలు పలికారు. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ జన్మదినం సందర్భంగా గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే భారీ ప్లెక్సీ ని ఏర్పాటు చేసారు. ఫ్లెక్సీ ముందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ అభిమానులు, గ్రామ క్రికెట్ యువత, బొల్లి సంటి, బసవయ్య,యే స్ , శోభన్ బాబు, బన్నీ, సాయి, హరినాథ్, రవి, నాగచైతన్య జస్వంత్, మనీ, శేఖర్ ఇంకా పలువురు గ్రామ క్రికెట్ క్రీడాకారులు, యువకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆదివారం గ్రామం లో క్రికేట్ సందడి చేశారు.
1 thought on “అబ్బాయిగూడెంలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు. ”