గోదావరిలో యువ రైతు గల్లంతు
- పడవల సహాయంతో గాలింపు కొనసాగింపు
వెంకటాపురం, అక్టోబర్19,(తెలంగాణజ్యోతి): వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన షేక్ పాషా అనే యువ రైతు ఆదివారం మధ్యాహ్నం గోదావరిలో గల్లంతైన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం.. పాషా వ్యవసాయ పనుల నిమిత్తం గోదావరి మధ్యలో ఉన్న లంకకు వెళ్తుండగా లంక కింద ఉన్న మడుగులో లోతు అంచనా వేయక పోవడంతో మునిగిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆయన బయటకు రాలేకపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు నాటు పడవల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు పాషా ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, అతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.