World beauties 2025 | రామప్ప ఆలయాన్ని తిలకించి అందాల భామలు ఫిదా
- ఆలయంలో శిల్పకళను చూసి తన్మయత్వం
- భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా
- చీరలు ధరించి..నుదుట కుంకుమ బొట్టుతో సందడి
- ఆలయంలో ప్రత్యేక పూజలు
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన రామప్ప ఆలయాన్ని బుధవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్,, అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రామప్ప ఆలయానికి 35 మంది ప్రపంచ సుందరిమణులు ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా చీరలు ధరించి నుదుట కుంకుమ, చీర కట్టుతో సుందరిమణులు సందడి చేశారు. రామప్ప ఆలయ చెంత ముద్దుగుమ్మలు ముచ్చటగా సేద తీరారు. ఇక్కడి ప్రజలు, అధికారులు సుందరి మనులను వింతగా తిలకించారు. కూచి పూడి, పేరిణి నాట్యం, గిరిజన నాట్య ప్రదర్శనలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం రామప్ప ఆలయంలోకి వెళ్లిన సుందరిమణులకు ఆలయ అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆలయంలో దాదాపు రెండు గంటల పాటు ఉన్నారు. ఇటు ఓరుగల్లు, అటు రామప్పలో చారిత్మక నేపథ్యం, కట్టడాలు, నిర్మాణశైలి, కాకతీయుల పాలన, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం తదితర విషయాలను తెలుసుకున్నారు. ఆలయ చరిత్రను తెలుసుకొని శిల్పకలను స్వయంగా తిలకించారు. ఆలయ చరిత్ర శిల్పకలను చూసి తన్మయత్నం చెందారు. రామప్ప చెంతన మిస్ వరల్డ్ పోటీ దారులు అబ్బురపడ్డారు. ప్రభుత్వ ఆతిథ్యం అధికారుల సహకారంపై, ప్రశంసలు కురిపించారు. రామప్ప ఆలయ ఆవరణలో మ్యూజిక్ సింఫనీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పేరిణి శివతాండవంతో పాటు పలు నృత్య ప్రదర్శనలు కళాకారులు అద్భుతంగా నిర్వహించారు. ఆలయంలో సుందరి మనులతో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడారు. వారితో కలిసి ఫోటోషూట్ లో పాల్గొన్నారు. మంత్రి వారికి ఆత్మీయంగా శిఖండి ఇచ్చారు. రామప్ప ఆలయ విశిష్టతను టూరిజం గైడ్లు వివరించారు. రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరిమణులు సాంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. ఆలయం అంతటినీ కలియతిరి గారు. ఫోటోలు దిగి సెల్ఫీలు తీసుకున్నారు.ఆలయ చరిత్ర, శిల్పకలను చూసి మంత్ర ముగ్ధు లయ్యారు. వరంగల్, ములుగు జిల్లాల్లో ఇవాళ మీరు చూసింది కొంచెమని, ఇక్కడ చూడాల్సినవి, తెలుసుకోవాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయనీ ములుగు కలెక్టర్ దివాకర వారికి వివరించారు. రామప్పలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నృత్య గురువు అలేఖ్య పుంజాల బృందంచేత రాణీ రుద్రమ దేవి ఆహార్యం, పరాక్రమంపై ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు మంత్రి సురేఖ ఆశాంతం తిలకించారు. ప్రపంచ సుందరిమనులకు మంత్రి బహుమతులు అందజేశారు. నృత్య ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన సుందరిమణులు కితాబు ఇచ్చారు. రామప్ప ఆలయ చరిత్ర ప్రాముఖ్యత సుందరిమణుల రాకతో మరింత విశ్వవ్యాప్తమైంది.