వెంకటాపురం మండల తాహసిల్దార్ కు సన్మానం
వెంకటాపురం మండల తాహసిల్దార్ కు సన్మానం
– ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా విధులు నిర్వహిస్తున్న తాహసిల్దార్ లక్ష్మీ రాజయ్యను ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం ఆదివాసి సంఘ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఏజెన్సీ చట్టాలు 1/59, 1/70, పేసా అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసి భూ సమస్యలను పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, 1/70 చట్టాన్ని ఉల్లంఘిం చిన గిరిజనేతరుల క్రయ, విక్రయాలు జరిపి, బహుళ అంత స్తుల నిర్మాణాలు చేపడుతున్న భవనాలపై యల్.టీ.ఆర్ కేసులునమోదు చేయాలని కోరారు. ఈసమావేశంలో సంఘా ల నేతలు పూనెం రామచందర్రావు ,పూనెం సాయి, పర్సిక సతీష్, రేగ గణేష్,కనితి వెంకటకృష్ణ, తాటి లక్ష్మణ్ తుర్స చంటి, తుర్స కృష్ణబాబు, కుంజ మహేష్ లు పాల్గొన్నారు.