తహసిల్దార్ కు వాడబలిజ సంఘం రాష్ట్ర కమిటీ సన్మానం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల తహసిల్దార్ కార్యాలయం లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ పి .లక్ష్మీ రాజయ్యను కలిసి తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘణంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్ర దామోదర్, వాడ బలిజ రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు గగ్గురి రమేష్, ములుగు జిల్లా యూత్ అధికార ప్రతినిధి కొప్పుల మహేష్ , ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లె మల్లికార్జున్, వెంకటాపురం మండల అధ్యక్షులు బొల్లె సునీల్, వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వాదం సుధాకర్, కోశాధికారి బొల్లె సారయ్య, కార్యదర్శి ఎర్రావుల కన్నయ్య, డర్ర రాంప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లె వంశీ, మండల కార్యవర్గ సభ్యులు సనగొండ పోతురాజు, బోగట నరసింహా రావు, పురుషోత్తం, కిషోర్, బన్నీ, సింటు, కిషోర్, ప్రవీణ్, సందీప్, సురేష్, మల్లికార్జున్, శ్రీను, రాజు, నరసింహారావు, నాగ సమ్మయ్య, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. వెనుక బడిన తరగతులుకు చెందిన వాడబలిజలకు కులం, ఆదా యం, నివాస ధ్రువీకరణ పత్రాలు, త్వరితగతిన మంజూరు చేయాలని, అలాగే బీ.సీ సంక్షేమ పథకాలు అర్హులైన వాడబలిజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మండల తాసిల్దార్ కు, రాష్ట్ర, మండల సంఘా లు సన్మానం సందర్భంగా విజ్ఞప్తి చేశారు.