ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో అధికారులు ఎక్కడ…?

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో అధికారులు ఎక్కడ...?

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో అధికారులు ఎక్కడ…?

– అధికార పార్టీ నాయకులే అధికారులా ..!

– మండల వ్యవసాయ శాఖ అధికారి ఉన్నట్టా..లేనట్టా..?

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని గుర్రెవు లలో వ్యవసాయ సహకారసంఘం నాయకులు సంబంధిత అధికారులు లేకుండానే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంబించడంతో చర్చనీయాంశం గా  మారింది. సంబంధిత అధికారులు ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి ఎందుకు వ్యవసాయ శాఖ అధికా రులు వెనకడుగు  వేస్తున్నారని రైతుల గుసగుసలు వినిపిస్తు న్నాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టి న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్ర స్థాయిలో అధి కారులతో నాయకులు మమేకమై ప్రారంభించాలి కానీ, నిబం ధనలకు విరుద్ధంగా.. నాయకులే అధికారులుగా… ఇష్టాను సారంగా.. వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.