ఏజెన్సీలో విథ్యా ఆణిముత్యం – ప్రతిభకి దక్కిన డాక్టరేట్
ఏజెన్సీలో విథ్యా ఆణిముత్యం – ప్రతిభకి దక్కిన డాక్టరేట్
– నిరుపేద కుటుంబంలో పుట్టి డాక్టరేట్ సాధించిన ముత్యాల ప్రసాద్.
తెలంగాణా జ్యోతి, వెంకటాపురం నూగూరు : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో ప్రతిభకి కొదవ లేదని నిరూపించారు చదువుల ఆణిముత్యం ముత్యాల ప్రసాద్. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పంచాయతీ పరిధిలో గల చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన ముత్యాల స్వామి, ఉదయ దంపతుల కుమారుడు ముత్యాల ప్రసాద్ ది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద గీత కార్మిక కుటుంబం. ఆ స్థాయి కుటుంబం నుండి వచ్చి,అనేక పరిశోధనలు చేసి, డాక్టరేట్ పట్టా పొంది అందరి మన్ననలు పొందుతు న్నాడు. ప్రసాద్ తన గ్రామం లోనీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు పూర్తి చేసి, ఇంటర్మీడియట్, డిగ్రీ భద్రాచలం ప్రభుత్వ కళాశాలల్లో చదివాడు. హైదరాబాద్‌లోని ఉస్మాని యా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి జియోఫిజిక్స్ పూర్తి చేశారు. . అనంతరం తన పరిశోధనను (ఎన్జీఆర్ఐ) నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా మొదలు పెట్టారు.రెండేళ్ల తరువాత నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్, తిరువ నంతపురంలో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా చేరి దక్షిణ భారత భూపొరలలో గల షియర్ జోన్స్, వాటి స్వభావం, స్థానికత వంటి వివిధ ’అంశాలపై జియోఫిజికల్ డేటా ఆధారంగా సమగ్ర పరిశోధనలు చేశారు .వాటికి గానూ కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముత్యాల ప్రసాద్ కు డాక్టరేట్ ప్రదానం చేసింది.ప్రస్తుతం సిజిడబ్ల్యూబి లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్థి స్తున్నారు. ఈ సందర్భంగా అందరి మన్ననలు పొందిన డా.ప్రసాద్ తన పరిశోధనలను ప్రోత్సహించిన గైడ్ ప్రొ.చంద్రప్రకాశ్ దూబే(ఐఐటి, ఖరగ్‌పూర్), తల్లిదండ్రులు, భార్య భార్గవి, బాబాయి నర్సింహులు, కిషోర్, స్నేహితులు సాగర్, మహేందర్, రాజు, సతీష్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.తన థీసిస్‌ను తొను పుట్టీ పెరిగిన చిన్న గొల్లగూడెం గ్రామానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.