దారి దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన వెంకటాపురం పోలిస్ లు
దారి దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన వెంకటాపురం పోలిస్ లు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు, వెంకటాపురం ప్రధాన రహదారిపై వాహనాలను ఆపివేసి దారి దోపిడికి పాల్పడే దొంగల ముఠను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ శుక్రవారం మీడియా కు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వాజేడు మండల ములోని జగన్నాధపురం వై జంక్షన్ వద్ద సి.ఐ కుమార్, వాజేడు ఎస్.ఐ హరీష్ ల ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ లు చేస్తుండగా, ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి వెంకటాపురం వైపు వస్తున్న తెలుపు రంగు షిఫ్ట్ డిజైర్ కారు పోలీసులను చూసి, కొంత దూరంలోనే ఆపి వెనుకకు తిప్పి పారి పోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు అట్టి వాహనం ను ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద కత్తి లభించగా, అనుమానంతో వారి వివరాలు తెలుసుకొనగా వారు తన పేరు బట్ట నీరజ్ కుమార్ వీరభద్రారం గ్రామం, మరియు కవ్వాల వెంకట శ్రీనివాస్ పాలెం గ్రామం, మరియు పూనేమ్ దిలీప్ @, దివాకర్ వీరభద్రారం గ్రామం అని పోలీసులకు పట్టు బడ్డ ముగ్గురు యువకులు తెలిపారు. ఈ నెల 25 న అర్ధరాత్రి వాజేడు మండలం లోని, ప్రగళ్లపల్లి గ్రామ శివారులో లారీలను ఆపి, వారికి కత్తి చూపించి, బెదిరించి వారి ప్రాణాలకు హాని కలిగించె విదంగా దాడి చేశారు.లారీ డ్రైవర్ వద్ద నుండి 3,000/- నగదును బలవంతంగా వసూలు చేసినట్టు విచారణ లో చెప్పి నేరం అంగీకరించారు. పోలీసు లు అట్టివారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి కత్తి, కారు వాహనం మరియు 1,500 రూపాయలు నగదును సీజ్ చేశారు. తగు చర్యల నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగిందని సి.ఐ.కుమార్ తెలిపారు. ఎవరైనా ఆకతాయి యువకులు దారి దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తిసుకోబడతాయ అని ఈసంథ్ ర్భంగా పోలీసులు హెచ్చరించారు.