ఉపాధ్యాయ నేత రాజస్వామి ఇక లేరు 

ఉపాధ్యాయ నేత రాజస్వామి ఇక లేరు 

– అనారోగ్యంతో మృతి

– స్వగ్రామం దామరకుంటలో విషాద ఛాయలు

– ఆఖరి శ్వాస వరకు ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం

కాటారం, తెలంగాణ జ్యోతి: ఉపాధ్యాయ సమస్యలపైనే చివరి వరకు పోరాటం చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకుడు చీర్ల రాజస్వామి (60) ఉపాధ్యాయుడు ఇక లేరు. అనారోగ్యంతో మృతి చెందారు. కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన చీర్ల రాజస్వామి మూత్రపిండాల వ్యాధితో కరీంనగర్ హాస్పిటల్ లో బుధవారం ఉదయం మృతి చెందారు. దామరకుంట ప్రైమరీ స్కూల్లో, ధన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాటారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయు లుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం విద్యాధికారిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడిగా పనిచేసిన కాలంలో మావోయి స్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు సైతం అనుమా నించి అనేకమార్లు వివిధ పోలీస్ స్టేషన్లో రాజస్వామి టీచర్ ను నిర్బంధించారు. ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడుగా ఉన్న కాలంలో అనేక ఒత్తిళ్లకు తలోగ్గి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు చేశారు. డిటిఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖలో కాటారం మండల ప్రధాన కార్యదర్శిగా , అధ్యక్షు లుగా, ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిలర్గా చీర్ల రాజస్వామి పనిచేశారు. కరీంనగర్ ఉమ్మడి పూర్వ జిల్లా మానకొండూర్, చొప్పదండి మండలాలకు ఎఫ్ ఏ సీ మండల విద్యాధికారి గా పనిచేశారు.గత కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడుతూ ఈనెల 8న బుధవారం తెల్లవారు జామున మరణించారు. రాజస్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన వారు( ప్రస్తుత నివాసం కరీంనగర్). డిటిఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖలో కాటారం మండల ప్రధాన కార్యదర్శిగా , అధ్యక్షులు గా, ఉమ్మడి జిల్లా కార్యదర్శి గా, రాష్ట్ర కౌన్సిలర్ గా పనిచేసిన కాలంలో మహదేవ్ పూర్,కాటారం ప్రాంతంలో డిటిఎఫ్ నిర్మాణానికి, బలో పేతానికి కృషి చేయడమే కాకుండా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు అవిరళ కృషి చేశారు. గ్రేడ్ 2 హెచ్ఎం గా ఆయన కరీంనగర్ పూర్వ ఉమ్మడి జిల్లా డిసిఇబి కార్యదర్శిగా పనిచేశారు. వారు పనిచేసిన సమయంలో ఇటు ఉపాధ్యాయులకు అటు అధికారులకు అందుబాటులో ఉంటూ విశేష సేవలందించి అందరిఆదరాభిమానాలు పొందారు. రాజస్వామి గారు నిగర్విగా, కార్యదక్షులు, నిరాడంబరులు ఏ బాధ్యతలు ఇచ్చినా చక్కగా నిర్వహించారని రాజస్వామి సమకాలికులు, ఉపాద్యాయ సంఘం నేత కోల రాజమల్లు గౌడ్ గుర్తుచేస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు .వారి మరణం పట్ల తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేస్తూ, నివాళులు అర్పిస్తూ డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. చీర్ల రాజ స్వామి రెడ్డి కరీంనగర్లో బుధవారం అకాల మరణం చెందగా, ఆయన కుటుంబ సభ్యులు అమెరికా లో ఉండగా, వారి రాక కోసం పార్థీవ దేహాన్ని ఫ్రీజింగ్ లో నిల్వ చేశారు. కాగా చీర్ల రాజస్వామి రెడ్డి అంత్యక్రియలు కరీంనగర్ రాంనగర్ స్మశాన వాటికలో శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు జరుగుతాయని తెలిపారు. వారి నివాసం కరీంనగర్ రెడ్ హిల్స్ కాలనీ, డ్యాం లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ నుండి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాజ స్వామి మరణ వార్త తో ఆయన స్వగ్రామం దామెర కుంట లో విషాద ఛాయలు అలుముకున్నాయి.