అందరి చూపు హస్తం వైపే
– కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ఈనెల 13న జరగ నున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రజలందరి చూపు హస్తం గుర్తువైపే ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజక వర్గం పరిధిలోని కాటారం మండలం వీరాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం చేపట్టింది. ఈనెల 13న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాటారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిం చారు. గురువారం కాటారం మండలం వీరపూర్ గ్రామ పంచాయతీ లో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కలిశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ క్లస్టర్ టీం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమినూరి ప్రభాకర్ రెడ్డి, ఉద్యమకారుల సంఘం నాయకులు బండం వసంత రెడ్డి, మాజీ సర్పంచ్ రఘువీర్, చీర్ల తిరుపతి, జావేద్ ఖాన్, దోమల సమ్మయ్య, బొమ్మన బాపిరెడ్డి పాల్గొన్నారు.
1 thought on “అందరి చూపు హస్తం వైపే ”