ఇంటి నిర్మాణ అనుమతులపై అవగాహన 

ఇంటి నిర్మాణ అనుమతులపై అవగాహన 

ఇంటి నిర్మాణ అనుమతులపై అవగాహన 

– ఎంపీఓ వీరాస్వామి

    కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఇంటి నిర్మాణం చేపట్టబోయే యజమానులు తప్పనిసరిగా పంచాయతీరాజ్ చట్టం మేరకు అనుమతులు తీసుకోవాలని కాటారం మండల పరిషత్ పంచాయతీ అధికారి వీరస్వామి కోరారు.సోమవారం మండలంలోని రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే కారణంతో నిర్మాణ సామాగ్రిని ఆయా గ్రామ పంచాయతీలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరిం చారు. కాగా రేగుల గూడెం, గంగారం అడ్డరోడ్డు, బూడిదిపల్లి తదితర గ్రామాల ప్రజలు ఎలాంటి ముందస్తు గ్రామపంచా యతీ నుంచి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతు న్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. తప్పని సరిగా గ్రామపంచాయతీ అనుమతులు తీసుకోవాలని లేని యెడల పంచాయతీరాజ్ ఆక్ట్ ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న భవన నిర్మాణ యజమానులకు షోకాసు నోటీసులు అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొ న్నారు. పనులను చేపడుతున్న ఇంటి యజమా నులను తీవ్రంగా మందలించారు. పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, సిబ్బందిని ఎవరైనా దుర్భాషలాడిన, విధులకు ఆటంకం కలిగించిన ఎడల వారిపై భారత న్యాయ సంహిత చట్టం మేరకు కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.