ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభల నిర్వహణ

ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభల నిర్వహణ

ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభల నిర్వహణ

– గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు.

– 21 నుండి నిర్వహించే గ్రామ సభల్లోనూ దరఖాస్తు తీసుకుంటాం.

– లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ.

– అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు.

– జనవరి 26 నుంచి నాలుగు నూతన పథకాల అమలు.

– జిల్లా ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మొద్దు.

– గ్రామ సభలకు జిల్లా ప్రజలు సహకరించాలి.

– కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

– నెంబర్ 1800 425 7109 ని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు : జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగినదని, దరఖాస్తు తీసుకుంటామని, లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని, జిల్లా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు చేరేలా పటిష్ట కార్యా చరణ అమలు చేస్తున్నట్లు, అందుకు గాను ఈ నెల 16 నుండి 20 వరకు క్షేత్ర స్థాయి దరఖాస్తులు పరిశీలన చేయడం జరిగిం దని, 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగు తుందనీ జిల్లా ప్రజలు సహకరించాలని జిల్లా తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించనుందని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట వేసినా, వేయక పోయినా అందుతుందని, రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దని, రైతు భరోసా పథకానికి ఎటువంటి పరిమితులు లేవని, వ్యవసాయ యోగ్య మైన ప్రతి ఎకరాకు 12 వేలు పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12 వేలు రూపాయలను అందించ నున్నట్లు, ఒక్కో విడతకు 6 వేల చొప్పున రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకా న్ని ప్రారంభించనుందని, 2023-24 సంవత్సరానికి ఉపాధి హామీ క్రింద పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలు గా పని చేసిన కార్మికుల జాబితాను తీసుకొని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుం బాలను ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ద్వారా సొంత భూమి ఉండి ఇండ్లు లేని కుటుంబాల జాబితాను సిద్ధం చేశామని, గ్రామ సభలో అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, గ్రామ సభలో అర్హుల జాబితా గ్రామాల వారీగా సిద్ధం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో విభజన అయినవారు కొత్త కార్డు కావాలని తీసుకున్న దరఖా స్తును కూడా పరిశీలిస్తామన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని అన్నారు. ఇదివరకు ఎప్పుడూ దరఖాస్తు సమర్పించకపోయినా గ్రామాల్లోకి వచ్చే అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డుల ప్రభుత్వ సంక్షేమ పథకాల పై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను, ఎం పి డి ఓ లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని లేదా కలెక్టరేట్లోనీ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109 ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment