అడ్డు అదుపు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు
అడ్డు అదుపు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ లంలో అక్రమ మట్టి రవాణాకు అడ్డాగా మారింది. చింత గూడెం శివారులో అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న నిత్రమత్తులో రెవిన్యూ అధికారులు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలోని చింతగూడెం, గ్రామంలో మట్టిని ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలో రోజురోజుకు పెరిగి పోతున్నా మట్టి అక్రమ రవాణాని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని మండల ప్రజలు వాపోతున్నారు. అక్రమ మట్టి వ్యాపారులు ఇస్టారీతిగా తరలిస్తున్న రెవెన్యూ అధి కారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ మట్టి తరలిస్తున్న విషయం పై ఎంఆర్ఓ వివరణ కొరకుఫోన్ చేయగా,తమకేమీ సంబంధం లేనట్టుగా స్పందించలేదు.మండలంలో అక్రమ మట్టి రవాణా ఆదివారం సెలవుల దినం రోజు తరలిస్తే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తరలింపు రెవెన్యూ అధికారులు కనుసనల్లోనే నడుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. సెలవు దినాల్లో దొంగ చాటుగా తరలించడం, ఏమిటో అర్థం కాని ప్రశ్న..? ఇప్పటి కైనా అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేస్తారా… అక్రమ మట్టి రవాణా వ్యాపారుల ఆగడాలకు రెవెన్యూ అధికారులు, అక్రమ తరలింపుకు అరికట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.