ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ.
– తృటిలో తప్పిన ప్రాణాపాయం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రంలోని వెంకటాపురం వేప చెట్టు సెంటర్లో సోమవారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న ఇసుక లారీ ధ్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో, ద్విచక్ర వాహన దారుడు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్, వేపచెట్టు సెంటర్ల నుండి కనకదుర్గమ్మ గుడి వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. అయినా కానీ ఇసుకలారీలు మృత్యు శకటాలుగా అతివేగంతో దుమ్ము లేపుకుంటూ వెళ్తూ, ఉండడంతో ప్రజలు వాహనదారులు భయాంధోళన వ్యక్తం చేస్తున్నారు. లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా, అతి వేగంగా లారీలను నడుపు తుండడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, ప్రజలు మార్కెట్ కు సరుకు లు కొనుగోలు చేసే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాబోయ్ ఇసుక లారీలు అంటూ బెంబోలెత్తిపోతున్నారు.ఈనేపధ్యంలో ఇసుక లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం ధ్వంసం అయింది. ఇసుక లారీలు అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో అనేక ప్రమా దాలు చోటుచేసుకుంటున్నయని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వెంకటాపురం పోలీసులు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఇసుక లారీ సంఘటనపై ఆరాతీస్తున్నట్లు సమాచారం.