ఉద్యాన పంటల సాగుపై రైతులకు శిక్షణ.
ఉద్యాన పంటల సాగుపై రైతులకు శిక్షణ.
– ఆయిల్ ఫామ్, కోకో, ఉద్యాన పంటలపై అవగాహన
ములుగు, తెలంగాణ జ్యోతి : రైతులు ఉద్యాన పంటలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన అధికారి సూర్య నారాయణ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ ఆద్వర్యంలో ములుగు జిల్లా రైతులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆయిల్ పామ్, కోకో, వక్క, ఇతర ఉద్యాన పంటల సాగుపై విజ్ఞాన యాత్రలో భాగంగా బుధవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన అధికారి సూర్య నారాయణ రైతులకు ఆయిల్ ఫామ్ తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోకో , వక్క, ఇతర పంటల సాగు పై వేసవి కాలం లో ఉద్యాన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రైతులు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీనీ సందర్శించగా ఉద్యాన పంటల సాగు వల్ల రైతులకు కలిగే లాభాలు వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమం లో ములుగు ఉద్యాన అధికారి వేణు మాధవ్, దమ్మపేట ఉద్యాన అధికారి సందీప్, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ వినోద్, ఆయిల్ పామ్ కంపెనీ ఆఫీసర్ నవీన్, రైతులు పాల్గొన్నారు.