బండారుపల్లి గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

బండారుపల్లి గురుకులం విద్యార్థికి విషపురుగు కాటు..!

బండారుపల్లి గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

– వరంగల్ కు తరలింపు 

ములుగు ప్రతినిధి : ములుగు మండలం బండారుపల్లి గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి విద్యార్థి అస్వస్థ తకు గురైన  సంఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యా యులు ములుగు ఆసుపత్రిలో చికిత్స అందించి వరంగల్ కు తరలించారు. శుక్రవారం ఉదయం మరో ఇద్దరు విద్యార్థు లకు అస్వస్థత కలగడంతో ములుగులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం కు రెఫర్ చేశారు. వారికి నోటి నుంచి నురుగులు గమనించిన వైద్యులు విష పురుగు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.అర్ధరాత్రి ములుగు మండ లం పందికుంటకు చెందిన శ్రీకర్ అస్వస్థతకు గురి కాగా, శుక్రవారం గోరి కొత్తపల్లికి చెందిన ప్రణయ్, వెంకటాపూర్ మండలం కేశవాపూర్ కు చెందిన కార్తీక్ లు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై విద్యా శాఖ అధికారులు విచా రణ చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారు.కాగా పాఠశాలలో పాములు, విష పురుగులు సంచరించడంపై ఆందోళన వ్యక్తం అవుతుం ది. సరైన నిర్వహణ లేక పోవడంతో ఈ సంఘటన జరిగి నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థు ల పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.  ఘటన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…