సుప్రీంకోర్టు తీర్పుతో మారనున్న మాదిగ జాతి బ్రతుకులు

Written by telangana jyothi

Published on:

సుప్రీంకోర్టు తీర్పుతో మారనున్న మాదిగ జాతి బ్రతుకులు

– మాదిగ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు యాసం రమేష్.

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో  మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. ఎస్సీల ఉమ్మడి రిజర్వే షన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ వెంకటాపురం మాదిగ జేఏసీ మండల అధ్యక్షులు తోకల అంజి ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. అనంతరం మాదిగ జేఏసీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు యాసం రమేష్ మాట్లాడుతూ 30 ఏళ్ళ మాదిగల సుదీర్ఘ న్యాయపోరాటానికి, భారత అత్యున్నత న్యాయస్థానం ( సుప్రీం కోర్ట్ ) తీర్పుతో మాదిగల చీకటి బ్రతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరించనున్నాయి. ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించాలని మొదలుపెట్టిన పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో విజయ తీరాలకు చేరింది. మాదిగ జేఏసీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గలిగిన మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించుకునే అధికారం ఉందని, చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కావాలని డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వంలో మాదిగ యువత దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఎస్సీలలో జనాభా దామాషా ప్రకారం ఎవరి కులం జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా దక్కాలని మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధించే వరకు మాదిగ ఉద్యమం కొనసాగిస్తుందని తెలిపారు. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ముందుంటామని, అసెంబ్లీలో ప్రకటించడం పట్ల మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ మండల అధ్యక్షులు తోకల అంజి,చెన్నం గౌతమ్, చెన్నం రమేష్, పేట రమేష్, కోగిల ప్రవీణ్, కోగిల సమ్మయ్య, వేల్పుల శివాజీ, తోకల నవీన్, రమేష్, కోగిల నాగార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now