డ్రైవింగ్ సీట్లోనే లారీ డ్రైవర్ మృతి
డ్రైవింగ్ సీట్లోనే లారీ డ్రైవర్ మృతి
– తృటిలో తప్పిన ప్రమాదం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల రహదారిలో 16 టైర్ల లారీలో ఇసుక లోడు చేసుకొని వస్తుండగా శనివారం సాయంత్రం కొండా పురం సమీపంలో డ్రైవింగ్ చేస్తున్న కొంకా రమేష్ (38) ఆకస్మికంగా స్టీరింగ్ పై వాలి మృతి చెందారు. ప్రాణం పోయే సమయంలో కూడా రమేష్ లారీని పక్కకు ఆపి మృతి చెందాడు. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి… వెంటనే లారీ డ్రైవర్ కొంకా రమేష్ ను తోటి లారీ డ్రైవర్లు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని ఆదివారం ఉదయం వెంకటాపురం ప్రభుత్వ వైశ్యాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ కొంక రమేష్ నల్గొండ జిల్లా మునుగోడు మండల ప్రాంతానికి చెందినవారు. ఈమేరకు ఆయన సోదరుడు కొంకా మహేష్ వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ డ్రైవర్కు కూతురు, కొడుకు ఉన్నారు. ఆయన భార్య ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు. రెక్కల కష్టం పై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న లారీ డ్రైవర్ కొంకా రమేష్ మృతి తో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. లారీ ఓనర్ ఆదివారం వెంకటాపు రం పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.