సాంస్కృతిక కార్యక్రమాలతో సృజనాత్మకత పెరుగుతుంది

Written by telangana jyothi

Published on:

సాంస్కృతిక కార్యక్రమాలతో సృజనాత్మకత పెరుగుతుంది

– శ్రీకృష్ణ, గోపికల వేషదారణలో చిన్నారుల ప్రదర్శన అద్భుతం

– ఆర్టీవో సిరాజ్ 

– ములుగులో ఘనంగా బాలగోకులం

ములుగుప్రతినిధి:సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శ న లతో చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని, శ్రీకృష్ణ, గోపికల వేషధారణలతో చిన్నారులు అద్భుతమైన ప్రదర్శన చేశారని జిల్లా రోడ్డు రవాణా శాఖ జిల్లా అధికారి సిరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం ములుగులోని తంగేడు స్టేడియంలో బాలగోకులం ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలు గొప్పవని, కులమతాలకతీతంగా పండగలు జరుపుకోవడం భారత్ లోనే చూస్తుంటామన్నారు. భారత రాజ్యాంగం ఎన్నోవిలులను కూడగట్టుకుందన్నారు. చిన్నారు లు గోపికలు, చిన్నికృష్ణల వేషధారణలో అలరించారని, వారిని తయారు చేయించిన గురువులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలగోకులంలో పాల్గొన్న పాఠశాలలకు శివాజీ చిత్రపటాలను మోమోంటో లుగా అందజేశారు. రాష్ట్రీయ సేవికా సమితి ప్రతినిధి వాంకు డోతు జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే మంచి నడవడిక అలవాటు చేయాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సద్గునాలు అలవాటు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నూనె భిక్షపతి పులిహోరా పొట్లాలు అందజే శారు. అదేవిధంగా సన్రైస్ స్కూల్ కరస్పాండెంట్ పెట్టెం రాజు సౌండ్ సిస్టం అందజేయగా కార్యక్రమంలో జోహార్ స్కూల్ కరస్పాండెంట్ ఎండీ.జావీద్, బ్రాహ్మణి స్కూల్ కరస్పాండెంట్ కర్ర రాజేందర్ రెడ్డి, బ్రలియంట్ స్కూల్ కరస్పాండెంట్ కోటి రెడ్డి, సెయింట్ ఆథోనీస్ స్కూల్ కరస్పాండెంట్ కవిత, బిట్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కొలగాని రజినీకాంత్, గిరిగాని కవిత, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్  శోభారాణి, సాధన స్కూల్ కర స్పాండెంట్ సురేందర్ రెడ్డి, లిటిల్ ఫ్లవర్ ప్రతినిధి కృష్ణ, అరవింద పాఠశాల కరస్పాండెంట్ అక్కల సతీష్, భవాని స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస రావులతోపాటు ధర్మజాగరణ ఉత్సవ సమితి సభ్యులు రవిరెడ్డి, రామగిరి శ్రీనివాస్, మంద మహేష్, రాయంచు నాగరాజు, మమన్, శ్రీతన్, జస్వంత్, సాయిరాం, సాత్విక్, అభినయ్, రాము, నవనీత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment