అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న బొలెరో వాహనం
అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న బొలెరో వాహనం
తెలంగాణ జ్యోతి , ఏటూరునాగారం : బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలైన సంఘటన తాడ్వాయి-చిన్న బోయి నపల్లి మధ్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన కుటుంబం ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చిన్న బోయినపల్లి తాడ్వాయి రహదారి మధ్యలో ఎదురుగా వస్తున్న ఇసుక లారీని తప్పిం చబోయిన బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిం ది.ఇందులో 20 మంది ప్రయాణిస్తుండగా, చదలవాడ రమణ అనే వృద్ధురాలు మృతి చెందింది. క్షతగాత్రులను 108 అంబు లెన్స్ లో ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించి వైద్య చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం కు తరలించారు.