నిరుపేదరాలి కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు

Written by telangana jyothi

Published on:

నిరుపేదరాలి కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు

తెలంగాణజ్యోతి, ఏటూరు నాగారం : నిరుపేదరాలి కుటుం బానికి ఏటూరునాగారం మండల కాంగ్రెస్ నాయకులు  అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందించారు. మంత్రి  సీతక్క ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన శీలం బాలమ్మ ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులైన గణేష్, శేఖర్ లను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి 50 కేజీల రైస్, రూ. 3 వేల ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్ -వీసం నర్సయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డొంగిరి మధుబాబు -లాల్ మహ్మద్, టౌన్ అధ్యక్షులు ఎండి సులే మాన్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,టౌన్ మాజీ ఉపసర్పంచ్ కర్ల అరుణ,మాజీ సర్పంచ్&ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం.బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఇరవేణి రాంలాల్, గంపల శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment