పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురడం ఖాయం
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురడం ఖాయం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ మండల ఇన్చార్జిలు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనీ, మోడీ నాయకత్వంలో కమలం పువ్వుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మండలాలకు ఇన్చార్జిలను నియమించినట్లు పెద్దపెల్లి జిల్లా, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, నిశిధర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గోమాస శ్రీనివాసు ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మోడీకి కానుకగా పంపిస్తామని బొమ్మన భాస్కర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహాదేవపూర్ మండలానికి ఇన్చార్జిగా కాటారం మండల బిజెపి మాజీ అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డిని నియమించారు. అలాగే కాటారం మండలానికి పిల్ల మరి సంపత్ ను, మల్హర్ మండలానికి పాగే రంజిత్ ను, మహా ముత్తారం మండలానికి దుర్గం తిరుపతిని, పలిమెల మండలానికి సిరిపురం శ్రీమన్నా రాయణను నియమిస్తూ ఈ మేరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు లేఖలో పేర్కొన్నారు.