జంతువధ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశం

జంతువధ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశం

జంతువధ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశం

తెలంగాణ జ్యోతి హైదరాబాద్ : బక్రీద్ పండగ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. జంతు వధ చట్టం పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. మూడు కమిషన రేట్ల పరిధిలో 150చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించా రు. ఇప్పటికే గోవుల తరలింపుపై 60 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎవరైనా జంతువుల అక్రమ వధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.