తపాలా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోండి
తపాలా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోండి
– భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ
వెంకటాపూర్ : తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సూచించారు.ఘనపూర్ మండలం సబ్ పోస్ట్ ఆఫీసు పరిధిలోని పాలంపేట గ్రామములో తపాలా శాఖ పథకాల గురించి గ్రామస్థులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లా డుతూ అధిక వడ్డీ పొదుపు పథకాలు, సుకన్య, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్, పి ఎం ఎస్ బి వై, ఏపీ వై, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు టాటా, బజాజ్, నివభూఫా, స్టార్, ఆదిత్య బిర్లా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తుంది అని అన్నారు. ఈ అవగాహనా సదస్సులో పాలంపేట పంచాయతీ సెక్రటరి రేవతి, మెయిల్ ఓవర్సీర్ సురేష్, ఘన పూర్ సబ్ పోస్ట్ మాస్టర్ సురేష్, పాలంపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సురేందర్, గ్రామీణ తపాలా ఉద్యోగులు గ్రామస్తులు పాల్గొన్నారు.