బాంబు పేలుడులో కాలు పోగొట్టుకున్న సునీత. 

బాంబు పేలుడులో కాలు పోగొట్టుకున్న సునీత. 

– కుటుంబానికి గ్రామస్తుల అండదండలు. 

– గ్రామస్తుల విరాళాల లక్ష ఇరవై వేలు నగదు అందజేత. 

– వైద్యశాలలో సునీతను పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరావు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో గురువారం జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడి కాలు సైతం పోగొట్టుకున్న డర్ర సునీతను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరావు గ్రామస్తులతో కలిసి పరామర్శించారు. హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం వి. ఆర్ .కె .పురం గ్రామపంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామ గ్రామ ప్రజలందరూ కలిసి వాడ బలిజ సేవా సంఘం తరపున ఇతరుల సహాయ సహ కారాలతో వి ఆర్ కె పురం యూత్ అందరూ కలిసి కట్టుగా చందాలు వసూలు చేసి నిరుపేద కుటుంబమైన డర్రా సునీత హాస్పిటల్ ఖర్చుల కొరకు రూ. లక్షా20 వేలను సునీత భర్త మహేష్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, డర్ర దామోదర్, తోట నాని, డర్ర రవి, సనగొండ పోతురాజు, డర్ర రాంప్రసాద్, దివాకర్, ప్రశాంత్, వెంకటేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.