రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

Written by telangana jyothi

Published on:

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

– తక్కల్లపల్లి రవీందర్ రావు

– 25 సార్లు రక్తదానం చేసిన రాజశేఖరుడు

నర్సంపేట, తెలంగాణ జ్యోతి :  ఈనెల 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా నర్సంపేట లోని జిల్లా ఆస్పత్రిలో తక్కలపల్లి రవీందర్రావు తో పాటు మరో 20 మంది రక్తదానం చేసారు. అనంతరం తక్కలపల్లి రవీంద ర్రావు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీటర్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధాన పరిస్థితుల్లో తల సేమియా వంటి వ్యాధులతో పాటు అనేక ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి పౌరుడు రక్తదానం చేసి మరొకరి ప్రాణానికి దాత కావాలని తద్వారా ఒకరిని ఒకరు కాపాడుకున్న వాళ్ళం అవుతామని అన్నారు ఈ సందర్భంగా 25 సార్లు రక్తదానం చేసిన ఎర్రబోయిన రాజశేఖర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ డాక్టర్ ఐ ప్రకాష్, వరంగల్ జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి డాక్టర్ పి గోపాల్, జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కిషన్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ మనోజిలాల్, ఆర్థో డాక్టర్ వీరిన్, డాక్టర్ స్నేహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు జయ్యారపు అఖిల్ పట్టణ ఎన్ఎస్ఈ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, దండెం రతన్ కుమార్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment